హుజురాబాద్ ఉప ఎన్నిక ముంచుకొచ్చేస్తుంది. పండుగ తర్వాత కదా అని తీరిగ్గా ఉన్న పార్టీలకు ఈసీ షాకిచ్చింది. అక్టోబర్ 30న ఎన్నిక అని తేదీలు ప్రకటించేసింది. దీంతో పార్టీల్లో హడావిడి మొదలైపోయింది. అయితే, ఓవైపు ప్రచారంపై దృష్టి పెట్టిన పార్టీలన్ని గతంలో ఎప్పుడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్ ను టార్గెట్ చేయబోతున్నాయి.
ఈసీ కొత్త నిబంధనల ప్రకారం 80 సంవత్సరాలు దాటిన వృద్దులు, వికలాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్ కు అర్హులు. ఉద్యోగులతో పాటు ఇప్పుడు వృద్దులు, వికలాంగులు కూడా కలిపితే మొత్తం ఓట్ల సంఖ్య 12వేలు దాటనుంది. ఇందులో 4454ఓట్లు వృద్దులు కాగా, 8139ఓట్లు వికలాంగులవి ఉన్నాయి. 147మంది ఉద్యోగుల ఓట్లున్నాయి.
అంటే ఇవి మొత్తం ఓట్లలో 6-7శాతం ఓట్లు. ఇప్పుడు ఈ 12వేల పైచిలుకు ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను మార్చబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలు గంపగుత్తగా తమవైపే ఉండాలే వ్యూహా రచన చేస్తున్నారు. దీంతో ఈ ఓట్లపై పార్టీల తాయిళాలు ఇచ్చేందుకు వెనుకాడేలా లేరని, హుజురాబాద్ లో ఓటర్లపై ప్రలోభాలు భారీగా ఉండనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.