చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. విడుదలైన మొదటి వారాంతం తర్వాత థియేటర్లన్నీ ఖాళీ. అలా కళ్లముందే కనుమరుగైపోయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. దీనికి కారణం సీనియర్ కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.
పరుచూరి పలుకులు అంటూ యూట్యూబ్ లో విశ్లేషణలిచ్చే గోపాలకృష్ణ.. ఆచార్య సినిమాపై తనదైన సమీక్ష చేశారు. సుతిమెత్తగానే మూవీపై సెటైర్లు వేశారు. తనదైన శైలిలో ఏకి పడేశారు.
ఆచార్య సినిమాలో మంచి పెర్ఫార్మెన్సులున్నాయి. మంచి డైలాగ్స్ ఉన్నాయి. డైరక్షన్ బాగుంది, మరి ఎందుకీ సినిమా ఫెయిలైంది. దీనికి ప్రధానంగా పరుచూరి చెప్పిన పాయింట్ ఏంటంటే.. ఇప్పటితరానికి అవసరం లేని కథ ఆచార్య. నక్సలిజాన్ని ఈ జనరేషన్ దాదాపు మరిచిపోయింది. ఇలాంటి కథావస్తువును ఎంచుకోవడమే మొదటి తప్పు అంటున్నారు పరుచూరి.
ఇక సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడవని, ఆచార్యలో ఆ ప్రయత్నం చేశారని పరుచూరి వివరించారు. వీటితో పాటు సినిమాలో స్క్రీన్ ప్లే మిస్టేక్స్ ను కూడా బయటపెట్టారు. కేవలం ఈ కారణాల వల్లనే ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందంటున్నారు పరుచూరి.