అతికొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన హీరోయిన్ షీలా. తెలుగులో కొన్ని సినిమాల్లోనే నటించిన షీల మొదట్లో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి…ఆ తరువాత సెకెండ్ హీరోయిన్ గా కెరీర్ని కంటిన్యూ చేసిందీ భామ. అయితే ప్రస్తుతం షీలా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిస్తే బాధగా అనిపించక మానదు.
‘సీతాకోకచిలుక’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది షీలా. అయితే ఈ సినియా యావరేజ్ గా ఉండడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఆ తరువాత మంచు మనోజ్ తో కలిసి ‘రాజుబాయ్’లో అలరించింది.
అయితే ఆ తరువాత అల్లు అర్జున్ తో కలిసి నటించిన ‘పరుగు’తో షీలా స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత వరుసగా మస్కా, అదుర్స్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత నటీమణుల మధ్య పోటీ పెరగడంతో షీలా సినిమాల నుంచి తప్పుకుంది.
ఆ తరువాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న షీలాకు క్యాన్సర్ వ్యాధి సోకిందట. అయితే షీలాకు క్యాన్సర్ ఉన్న విషయం ఆమె ఎప్పుడూ బయటపెట్టలేదు. తనకు ఈ వ్యాధి ఉన్నా కొన్ని సినిమాల్లో నటించిదట.
తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ పలు సినిమాలు చేసిన ఈ భామ ఆ తరువాత క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటుందట. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతోందని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నారు.
అయితే ఈ విషయాన్ని అమె ఎవరికీ చెప్పుకోవడం లేదట. ఎవరి సాయం తీసుకోకుండా ఆమె జీవితాన్ని ఆమె మేనేజ్ చేసుకుంటుందట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకుని నడిపిస్తుందని అంటున్నారు.
అయితే ఇతరులను సాయం అడగడం ఇష్టం లేకనే, తన కాళ్లపై తాను నిలబడాలని సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వహిస్తోందట. అయితే షీలా గురించి తెలిసిన వాళ్లు షాక్ అవుతున్నారు.
తెలుగు సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న షీలా పరిస్థితి ఇలా మారిందేమిటి..? అని చర్చించుకుంటున్నారు. అయితే ఆమె లెటేస్టు ఫొటోస్ కూడా ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తపడుతుండడం విశేషం.