కస్టమ్స్ సిబ్కబంది కన్నుగప్పి విదేశీ కరెన్సీతో దర్జాగా దేశం దాటిద్దామని విఫలయత్నం చేసిన వ్యక్తి క్రియేటివిటీ నెట్టింట వైరల్ అవుతోంది. రూ.64 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఒక వ్యక్తి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. చెకింగ్ సిబ్బందిని డైవర్ట్ చేసేందుకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
ఆ వ్యక్తి వద్ద సరైన పత్రాలు కూడా లేకపోవడంతో అతడి తీరుపై అనుమానం వ్యక్తం చేశారు సిబ్బంది. అంతర్జాతీయ డిపార్చర్ వద్ద ఉన్న కస్టమ్స్ కార్యాలయానికి ఆ వ్యక్తిని తీసుకెళ్లారు. అతడి ట్రాలీ బ్యాగ్‌ను ఎక్స్ రే స్కానర్‌తో తనిఖీ చేశారు.
కాగా, ఆ ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో విదేశీ కరెన్సీ ఉన్నట్లు కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి అందులో దాచిన విదేశీ నోట్లను సూది, దారం సహాయంతో బయటకు తీశారు.
68,400 యూరోల విలువైన 200 డినామినేషన్ ఉన్న 342 నోట్లు, 5,000 న్యూజిలాండ్ డాలర్ల విలువైన 100 డినామినేషన్ ఉన్న 50 నోట్లు ఉన్నట్లు గుర్తించారు.భారత కరెన్సీలో వీటి విలువ రూ.64 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విదేశీ కరెన్సీ కలిగిన వ్యక్తిని సురీందర్ సింగ్ రిహాల్‌గా గుర్తించారు. దీనిపై దర్యాప్తు కోసం కస్టమ్స్ అధికారులకు అతడ్ని అప్పగించారు.
మరోవైపు ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్ లోపల గుట్టుగా దాచిన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు బయటకు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి అతను చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి అంటున్నారు నెటిజన్లు.
#CISFTHEHONESTFORCE
Vigilant #CISF personnel apprehended a passenger carrying foreign currency (worth approx. Rs 64 lakh) ingeniously concealed in the handles of his trolley bag @ IGI Airport, New Delhi. The Passenger was handed over to Customs.@HMOIndia
@MoCA_GoI pic.twitter.com/oLyHkxAOr2— CISF (@CISFHQrs) January 29, 2023