భారతదేశంలో విద్యుత్ సంక్షోభం భారీగా పెరిగిపోయింది. దీంతో అనేక ప్రాంతాలు గంటలు తరబడి బ్లాక్ అవుట్ లను ఎదుర్కొంటున్నాయి.
అయితే.. విద్యుత్ తయారికి కావలసి బొగ్గును రైలు మార్గాన తరలిస్తున్నారు అధికారులు. బొగ్గు క్యారేజీలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వందలాది ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు.
కొన్ని పరిశ్రమలు శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ప్యాసింజర్ రైళ్ల రద్దుపై భారతీయ రైల్వే అధికారి ఒకరు స్పందించారు.
రద్దు తాత్కాలికమేనని.. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైళ్లను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు.