నాగపూర్ నుండి ముంబాయి వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు హల్ చల్ చేశాడు. విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు. ఇది చూసిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుడిని అడ్డుకున్నారు. పైలెట్ కు సమాచారం అందించారు.
తలతిక్క ప్రయాణికుడి చేష్టలకు విమానంలో కూర్చున్న మిగతా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడిని సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలకు అప్పగించారు.
ముంబైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. అదుపుతప్పి ప్రవర్తించిన ప్రయాణికుడిపై FIR నమోదు చేశారు.విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత కేబిన్ సిబ్బంది పరిశీలించారు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ తొలగించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ముంబై విమానాశ్రయ పోలీసులు రంగంలో దిగి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.