విమానాన్ని ఎలా నడపాలో తెలియని ఓ ప్రయాణికుడు దాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. అందులో ఉన్న పదుల మంది ప్రయాణీకుల ప్రాణాలను అతను రక్షించాడు. దీంతో అతన్ని గ్రేట్ హీరో అంటూ అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఈ ఘటన పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది. యుటిలిటీ విమానం నడుపుతున్న పైలెట్ ఒకరు అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయాడు.
దీంతో ఆ పైలెట్ ను గమనించిన ప్రయాణీకుడు ఒకరు వెంటనే ఈ విషయాన్ని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు. అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని కంట్రోల్ రూమ్ కు తెలిపాడు.
దీంతో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో చెప్పండంటూ ప్రయాణీకుడిని కంట్రోల్ రూమ్ అధికారులు అడిగారు. దీంతో తనకు చాలా భయమవుతోందని, ఎదురుగా ఫ్లోరిడా తీరం కనిపిస్తోందని, తనకు విమానం నడపడం రాదని ఏం చేయాలో తెలియడం లేదని కంట్రోల్ రూమ్ కు తెలిపాడు.
దీంతో కంగారు పడవద్దని, తాము ఇచ్చే ఆదేశాలను పాటించండంటూ ఆ ప్రయాణికుడి కంట్రోల్ రూమ్ అధికారులు గైడ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో అతడు భయం భయంగానే వారు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ ఫ్లైట్ ను విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశాడు.
విమానాన్ని ఆ ప్రయాణికుడు సేఫ్ గా ల్యాండ్ చేయడంతో కంట్రోల్ రూమ్ అధికారులు ఆశ్చర్య పోయారు. ఓ మైగాడ్ … యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అంటూ ఆయనపై ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.