కరోనా వైరస్‌తో అధికారులు టెన్షన్ పడుతూ… జనాన్ని టెన్షన్‌కు గురి చేస్తున్నారు. కరోనా టెస్ట్‌ల కోసం ఆలస్యం చేస్తుండటం, టెస్ట్ చేసే వరకు ప్రయాణికులను భయటకు పంపించటం లేదు. దీంతో ఆగ్రహావేశాలతో… ప్రయాణికులు చంపేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో హల్‌చల్ అవుతోంది.
పాస్‌పోర్టులు తీసుకొని తిరిగి ఇవ్వటం లేదని, టెస్ట్‌లు చేయించుకుంటేనే ఇస్తామంటున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం కరోనా స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయనిదే ఎవరినీ విడిచిపెట్టం అని తెగేసి చెబుతుండటంతో పాటు… టెస్ట్‌లకు చాలా సమయం పడుతుండటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు.