ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కు చేదు అనుభవం ఎదురైంది.కాకినాడ సీబీయం కళాశాల గ్రౌండ్ లో పాల్ కాన్వాయ్‌ని బంధించారు. స్థానిక పాస్టర్, ఫైనాన్షియర్లు. తమకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బులను అడిగితే పాల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సాస్టర్ రత్నకుమార్ తెలిపారు.
దీంతో పాల్ కాన్వాయ్ రెండు కార్లను సీబీసీఎన్‌సీ కాంపౌండ్‌లో ఉంచినట్లు రత్నకుమార్ తెలిపారు. అయితే పాల్‌కు పాస్టర్ రత్నకుమార్ మధ్య ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా తమపై బెదిరింపులకు దిగుతున్నారని అందుకే పాల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లు తెలిపారు.
కాగా, కేఏ పాల్ బౌన్సర్లు గేటు తాళాలను బలవంతంగా తీసే ప్రయత్నం చేయగా, వారిని అడ్డుకున్నట్లు తెలిపారు. దీంతో పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే పాల్ రెండు కార్లను హోటల్ వద్ద పార్క్ చేస్తుండగా, పాస్టర్ వచ్చి తమ స్థలంలో పార్క్ చేసుకోవాలని కోరాడు.
దీంతో ఆ రెండు కార్లను సీబీసీఎన్‌సీ కాంపౌండ్ లోపల పార్క్ చేయగా, పాస్టర్ రత్నకర్ వెంటనే తాళం వేసి వెళ్లిపోయాడు. తాను అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బును రాబట్టుకునేందుకే ఇలా కార్లను తన కార్లను సీజ్ చేసినట్లు చెప్పారు.