ఇప్పటివరకు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం బాహుబలి-2 మాత్రమే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ కు 510 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఇప్పుడీ రికార్డ్ కు అతి దగ్గరగా వచ్చింది పఠాన్ మూవీ. షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా, మరికొన్ని రోజుల్లో బాహుబలి-2 రికార్డ్ ను క్రాస్ చేసేలా ఉంది.
తాజాగా నార్త్ బెల్ట్ లో పఠాన్ సినిమాకు 481 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, ఈ వీకెండ్ నాటికి మరో 30 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందనే అంచనాలున్నాయి. అదే కనుక జరిగితే బాహుబలి-2 రికార్డ్ బద్దలవుతుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పఠాన్ నిలుస్తుంది.
షారూక్-దీపిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే కేజీఎఫ్-2ను క్రాస్ చేసింది. అటు ఓవర్సీస్ లో కూడా ఆల్ టైమ్ హిట్స్ జాబితాలోకి ఎంటరైంది.
అయితే, వరల్డ్ వైడ్ బాహుబలి-2 సాధించిన వసూళ్లను పఠాన్ క్రాస్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లే వచ్చాయి.