ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అయితే, చాలా కాలం క్రితమే ఈ రేంజ్‌ను ఏర్పరచుకున్న హీరో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అయితే, దాదాపు ఐదేళ్లుగా ఈ సీనియర్ హీరో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే షారూఖ్ ‘పఠాన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది.
దీంతో ఈ క్రేజీ యాక్షన్ మూవీ భారీ వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సీనియర్ పానిండియా స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా రెండు రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 165 కోట్లు నెట్, రూ. 315 కోట్లు గ్రాస్ వచ్చింది.
షారూఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జోడీగా చేసిన ‘పఠాన్’ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా నాలుగో రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 104 కోట్లు గ్రాస్, రూ. 53 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘పఠాన్’ మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 214 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 417 గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను సైతం ఈ మూవీ బద్దలు కొట్టేసింది.
బాలీవుడ్ సీనియర్ షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ‘పఠాన్’ చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 20 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు ఆరు మిలియన్లను కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది.
షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 214 కోట్లు నెట్ వసూలు చేసింది. తద్వారా ఇండియాలో తక్కువ రోజుల్లోనే ఈ మార్కును చేరుకున్న ఇండియన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్ 2’ పేరిట ఉన్న ఐదు రోజులు, ‘బాహుబలి 2’ పేరిట ఉన్న ఆరు రోజులు రికార్డులను బ్రేక్ చేసింది.