షారూక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా బాలీవుడ్ ఆకలి తీర్చింది. ఈ చిత్రం రోజురోజుకు రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతోంది. అలా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ 832 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. తాజాగా మరో రికార్డ్ సృష్టించింది.
ఇండియాలో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది పఠాన్. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 సినిమాను వెనక్కు నెట్టింది. నార్త్ బెల్ట్ లోని అన్ని ప్రాంతాల్లో హిట్టవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. అదే పఠాన్ ను అగ్రస్థానంలో నిలబెట్టింది.
ఇక ఈ సినిమా రాకతో అటు ఓవర్సీస్ లో కూడా టాప్-10 ఆర్డర్ మారిపోయింది. ఓవర్సీస్ లో సూపర్ హిట్టయిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది పఠాన్.
యూఎస్ లో టాప్-10 ఇండియన్ సినిమాల లిస్ట్..
1. బాహుబలి 2 – 20 మిలియన్ డాలర్లు (అన్ని భాషలు కలిపి)
2. పఠాన్ – 14.4 మిలియన్ డాలర్లు (ఇంకా ఆడుతోంది)
3. ఆర్ఆర్ఆర్ – 14.3 మిలియన్ డాలర్లు
4. దంగల్ – 12.3 మిలియన్ డాలర్లు
5. పద్మావత్ – 12.1 మిలియన్ డాలర్లు
6. పీకే – 10.5 మిలియన్ డాలర్లు
7. బాహుబలి – 8.3 మిలియన్ డాలర్లు (అన్ని భాషలు కలిపి)
8. భజరంగీ భాయ్ జాన్ – 8.1 మిలియన్ డాలర్లు
9. ధూమ్ 3 – 8.1 మిలియన్ డాలర్లు
10. సంజు – 7.9 మిలియన్ డాలర్లు