బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, గ్లామర్ క్వీన్ దీపికా పదుకోనే నటించిన పఠాన్ చిత్రం హిట్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. రిలీజ్‌కు ముందు ఏర్పడిన భారీ అంచనాలతో ఈ సినిమా అనూహ్యమైన ఓపెనింగ్స్ మొదలయ్యాయి. గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ పరంగా రికార్డులు తిరగరాసింది. జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది.
షారుక్ ఖాన్‌కు తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో పఠాన్ సినిమా రిలీజైంది. విడుదలకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు భారీ క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. యాక్షన్ ఎపిసోడ్స్, షారుక్ ఖాన్ సిక్స్ ప్యాక్, జాన్ అబ్రహం విలనిజం, దీపికా పదుకొనే గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పఠాన్ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలు, ఈ సినిమా పాటలు, హీరోయిన్ దుస్తులు, ఇతర అంశాలపై హిందు సంస్థల అభ్యంతరాలు లేవనెత్తడంతో సినిమా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సెన్సార్ అభ్యంతరాలు, బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్ కాట్ పఠాన్ అంశాలు సినిమాను మరింత వివాదంలోకి నెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో పఠాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పఠాన్ సినిమాపై వివాదాలు, అభిమానుల క్రేజ్ కొనసాగుతుండగా.. బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే షారుక్ ఖాన్ మూవీ అనూహ్యమైన స్పందన కూడగట్టుకొన్నది. దాంతో ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ సినిమాలకు మించిన అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. బాహుబలికి దరిదాపుల్లో ఈ సినిమా కలెక్షన్లు సాధించింది.