శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె తో పాటు ఆమె కూతురు, సంజయ్ రౌత్ సోదరుడు సనిల్ రౌత్ కూడా వెంట వెళ్లారు.
ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఆమె స్టేట్ మెంట్స్ ను అధికారులు రికార్డ్ చేయనున్నారు. గతంలో పలు సార్లు ఆమె పేరును ప్రస్తావించినా, ఇప్పటి వరకు ఆమెను ఈడీ ప్రశ్నించలేదు.
సంజయ్ రౌత్ కస్టడీని మరి కొన్ని రోజులు పొడిగించాలంటూ ఇటీవల ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీని ఈ నెల 8 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో ఆయన కస్టడీ పొడిగించిన కొద్ది గంటల్లోనే వర్షా రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు ఈ నెల 6న హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.