ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై, వైసీపీ నాయకులపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
మీ సైకో డీఎన్ఏ చంచల్ గూడ జైలు అయితే.. లోకేష్ డీఎన్ఏ ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అని ఫైర్ అయ్యారు. సైకో జగన్ సొంత నియోజకవర్గానికి నీళ్లిచ్చిన డీఎన్ఏ చంద్రబాబుదని స్పష్టం చేశారు. చంద్రబాబు తెచ్చిన కియా అనుబంధ సంస్థలను తరిమికొట్టిన డీఎన్ఏ జగన్ ది అన్నారు.
లోకేష్ దృష్టిలో డీఎన్ఏ అంటే కట్టడం, నిర్మించడం, అభివృద్ధి చేయడమని అన్నారు. జగన్ దృష్టిలో డీఎన్ఏ అంటే కూల్చడం, నాశనం చేయడమని చెప్పారు.
సీమను దోచుకోడానికే ఓబుళాపురం గనిని తీసుకొచ్చారని, లేపాక్షి హబ్ పేరుతో సీమలోని వేలఎకరాలు మింగేశారని ఆరోపించారు. భారతిని రోడ్డు మీదకు తీసుకువచ్చింది మీ సైకోనే అని వ్యాఖ్యలు చేశారు పట్టాభిరామ్.