దసరా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానని సంచలన ప్రకటన చేశారు పవన్ కల్యాణ్. దీంతో అతడితో సినిమాలు చేస్తున్న నిర్మాతలంతా కంగుతిన్నారు. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా తప్ప, మిగతా సినిమాలన్నీ పాక్షికంగా ఆగిపోయినట్టేనంటూ కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆ కథనాల్లో కొంత నిజం ఉంది, మరికొంత అబద్ధం ఉంది.
పవన్ లైనప్ కు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ ఇది. హరిహర వీరమల్లు సినిమాను పవన్ పూర్తి చేస్తారు. ఇది ఫిక్స్. ఈ మూవీతో పాటు వినోదాయ శితం రీమేక్ ను ఆయన పూర్తి చేస్తారు. ఈ మేరకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు ఆయన మాటిచ్చారు. రాబోయే 3 నెలల్లో వినోదాయశితం రీమేక్ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని, మినిమం గ్యాప్స్ లో తను సెట్స్ కు వస్తానని హామీ ఇచ్చారు.
Advertisements
ఇందులో మరో హీరోగా సాయితేజ్ నటించబోతున్నాడు. ఈ 3 నెలలు తనకు అందుబాటులో ఉండాలని, ఎప్పుడు కోరితే అప్పుడు కాల్షీట్లు ఇవ్వాలని సాయితేజ్ కు సూచించారు పవన్ కల్యాణ్. అలా దసరా ముందే వినోదాయశితం రీమేక్ ను పవన్ పూర్తిచేయబోతున్నారు. హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలను పాక్షికంగా ఆపేశారు.