పవిత్ర లోకేష్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగుతోంది. కారణం.. ఈమె నటుడు నరేశ్‌తో సహజీవనం చేయడమే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన నరేశ్, పవిత్ర ఇద్దరూ కూడా తాము పెళ్లి చేసుకోవడం లేదని, కేవలం సహజీవనం చేస్తున్నామని తెలిపారు.
కొద్ది రోజుల క్రితం కూడా బెంగళూరులో వీరిద్దరూ ఉండగా నరేశ్ మూడో భార్య వీరి మీద చెప్పుతో దాడి చేయబోయారు. అయితే వీరిద్దరూ పోలీసుల సహకారంతో అక్కడ నుంచి బయటపడ్డారు. అయితే అసలు ఎవరు ఈ పవిత్ర లోకేశ్… ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా..!!అయితే ఇది చదివేయండి..
ఈమె కన్నడలో టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించారు. ముఖ్యంగా కన్నడలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో ఈమె బాగా ఫేమస్ అయ్యారు. కర్ణాటకలో మైసూర్‌లో జన్మించిన ఈమె తండ్రి మైసూర్ లోకేష్ కన్నడ స్టేజ్ కమ్ ఫిల్మ్ యాక్టర్. తండ్రి వారసత్వంలో సినిమాల్లో అడుగులు వేసింది.
ప్రస్తుతం కొందరు హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తోన్న ఈమె వయసు 45 సంవత్సరాలలోపు కావడం విశేషం. ఈమె తన 16 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసింది. 1994లో అంబరీష్ హీరోగా నటించిన ‘మిస్టర్ అభిషేక్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అదే ఏడాది ’బంగారద కలశ’లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అందం, అభినయం ఉన్న అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హీరోల కంటే ఈమె పొడుగు కావడంతో ఈమెకు సరైన అవకాశాలు లభించలేదు.
5.10 అంగుళాలున్న ఈమె పొడవుగా ఉండటం ఈమె హీరోయిన్ అవకాశాలకు గండిపడేలా చేసింది. ఈమె కన్నడలో దాదాపు 150 పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. 2006లో తెరకెక్కిన ‘నాయి నేరాలు’ సినిమాలో నటకు గాను ఈమె కర్ణాటక స్టేట్ అవార్డు అందుకుంది.
పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా కన్నడ కూడా నటుడే. ఈమె ముందుగా ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో మనస్పర్ధల కారణంగా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సుచేంద్ర ప్రసాద్ తో సహ జీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు నరేష్‌కు దగ్గరైంది. త్వరలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకవేళ చేసుకుంటే.. ఈమె మూడో పెళ్లి అవుతోంది. నరేష్‌కు నాల్గవ పెళ్లి అవుతోంది.
10వ తరగతిలో తండ్రి మైసూర్ లోకేష్ ఆకస్మిక మరణంతో చదువు కొనసాగిస్తూనే సినిమాలవైపు అడుగులు వేసింది. అంతేకాదు సినిమాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేసి .. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రీ పేర్ అయ్యింది. ఒక సారి రాసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. దీంతో సినిమాలను కెరీర్‌గా ఎంచుకున్నారు.
సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రల్లో మెప్పించినా.. ఆ తర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. తెలుగులో రవితేజ దొంగోడు సినిమా ఈమెకు తొలి చిత్రం. ఆ తర్వాత తెలుగులో తల్లి, చెల్లి, అత్త పాత్రల్లో నటించిన టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ప్రస్తుతం నరేష్‌తో సహ జీవనం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు