నరేష్- పవిత్ర మలిదశ ప్రేమ జంట.మొదలైనప్పటి నుంచీ తరచూ వివాదాల్లో విలవిల్లాడుతున్న ప్రేమజంట. రీసెంట్ గా ఒక పెళ్లి వీడియోను పోస్ట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఆ వీడియో నిజం కాదని ఓ సినిమా కోసం అని ఆ తరువాత మరో క్లారిటీ వచ్చింది. అయితే వీరిద్దరి బంధం గురించి పవిత్ర మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే..
నరేష్ – పవిత్ర ఈ ఇద్దరి బంధం గురించి, వీరి లవ్ గురించి, వీరి పెళ్లి గురించి జరిగినంత చర్చ మరే సెలబ్రిటీ గురించి జరగలేదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు. అయితే పవిత్ర పక్కా ప్లాన్ తోనే నరేష్ ను ట్రాప్ చేసి లవ్ ట్రాక్ నడిపించిందని పవిత్ర మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.
1500 కోట్ల రూపాయల ఆస్తి కోసమే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అంటూ సుచేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు నరేష్ – పవిత్రలు. ఇలాంటి సమయంలో పవిత్ర లోకేష్ మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరో దుమారాన్ని లేపాయి.
గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్ నరేష్ – పవిత్ర లోకేష్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వారిపై సుచేంద్ర చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ‘పవిత్రకు విలాసవంతమైన లైఫ్ అంటే ఇష్టం.. అలాంటి లగ్జరీ లైఫ్ కోసం పవిత్ర ఎలాంటి పనైనా చేస్తుంది అని అన్నారు.
ఇక పవిత్రా ఎవరినైనా మోసగిస్తుందని పవిత్ర పక్కా అవకాశవాది అంటూ అందులో ఆమెను మించిన వారు మరొకరు లేరని ఆయన అన్నారు. ఇక నరేష్ విషయంలోనూ పవిత్ర లోకేష్ ప్లాన్ వేరే ఉందని కూడా చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక నరేష్ మొదటి భార్య కూడా ఆమెపై గతంలోనే విమర్శలు చేశారు.
ఇక మొత్తానికి పవిత్ర మోసాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారని మొదటి భర్త చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నరేష్ ఆస్తులు ఎంత అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ విషయంలో కూడా సుచేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
VK నరేష్ తల్లి విజయ నిర్మల ఎంతో సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ఆమె సంపాదించిన ఆస్తి అంతా నరేష్ కే చెందుతుంది. అలా విజయ నిర్మల సంపాదించిన రూ.1500 కోట్ల ఆస్తిని కొట్టేయడానికే నరేష్ తో పవిత్ర అఫైర్ నడిపిస్తోంది.’ అంటూ సుచేంద్ర ప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు.
పవిత్ర ప్లాన్ ఏంటి అనేది నరేష్ కు ఇంకా అర్థం అయినట్లుగా లేదని సుచేంద్ర అన్నాడు. పవిత్ర ప్లాన్ త్వరలోనే నరేష్ కు అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే మరోవైపు నరేష్ పవిత్రల బంధం ఏమిటి అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. ఇక నరేష్ త్వరలోనే ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇస్తానని చెప్పారు.