దాదాపు ఆరు నెలల నుంచి పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక వీరు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. కలిసి ఉంటున్నారు గాని వివాహం విషయంలో క్లారిటీ లేదని అందుకే పెళ్లి వాయిదా పడుతుంది అంటున్నారు. నరేష్ కి మూడు పెళ్ళిళ్ళు కాగా మూడో భార్య వీరి వ్యవహారంపై సీరియస్ అయింది.
బెంగుళూరు హోటల్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో నరేష్ మా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు పవిత్ర లోకేష్ కు సపోర్ట్ తోనే గెలిచా అని చెప్పడం, వీరు చేసిన సినిమాలు అన్నీ కాస్త ఆశ్చర్యం కలిగించాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు వీరు విడిపోయారు అనే మాట వినపడుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కారణంగా విడిపోయారు అంటున్నారు.
రమ్యకు సినిమా పరిశ్రమలో పలుకుబడి ఎక్కువగా ఉందని, పవిత్ర లోకేష్ కు వచ్చిన సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారని, ఆమెను సినిమాల్లోకి తీసుకున్న వాళ్ళు కూడా తీసి పక్కన పెట్టారని అంటున్నారు. పవిత్ర లోకేష్ ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తుంది. ఇక నరేష్ మరొకరితో స్నేహంగా ఉంటున్నారని అందుకే విదిపోయారనే కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరి పవిత్ర లోకేష్ ఏమంటారో చూడాలి.