మెగా స్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ “తగ్గేదే లే”అంటుంటే చిరు మాత్రం తగ్గేస్తాలే అంటున్నాడు.
ఇటీవల, టిక్కెట్ల ధరల వివాదంలో చిరంజీవి ఏపీ సీఎం జగన్‌కు వంగి వంగి దండాలు పెట్టారు. ఎన్ని దూషణలు, దాడులు, అవమానాలు జరిగినా సీఎం జగన్‌ను కలవడానికి అవిశ్రాంతంగా ప్రయత్నించింది చిరంజీవి ఒక్కరేనని స్వయంగా మంత్రి పేర్ని నాని కూడా బహిరంగంగా ప్రకటించారు. ఇక కొత్త GO తర్వాత జగన్‌కు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తి కూడా చిరంజీవి.
మరోవైపు పవన్ కళ్యాణ్ …. రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో మొదలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సన్నాసి మంత్రులు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్ బలవంతం చేస్తే తన సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. దీనితో జగన్ సర్కార్ భీమ్లా నాయక్ విడుదల కాకముందే, ప్రతిదాడిని ప్రారంభించింది.
ఇదిలా ఉండగా కొత్త GO విషయంలో పరిశ్రమకు చెందిన కొంతమంది పవన్‌కు ఫోన్ చేసి, సవరించిన GO కోసం జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని కోరారట. కానీ పవన్ అందుకు నిరాకరించాడట.
ఇది ఒక్కటే కాదు. రాజకీయాల్లో ఉంటూనే చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి సోనియాగాంధీకి తలవంచటం , ఇలా చాలా విషయాల్లో చిరంజీవి ‘తగ్గేస్తా లే’ అంటూ ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయినప్పటికీ తగ్గేదేలే అంటూ పోరాడుతున్నాడు.