వాల్తేరు వీరయ్య సినిమాకు మరో పెద్ద బూస్టప్ దక్కింది. ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ ను పవన్ మెచ్చుకున్నాడు. అన్నయ్య చిరంజీవి స్టెప్పులు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను ప్రత్యేకంగా ప్రశంసించాడు.
“బాస్ పార్టీ పాటని ఐపాడ్ లో పవన్ కళ్యాణ్ కి చూపించాను. అభిమానుల రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్ బాబు కి ఇష్టమైన జాతరలాంటి సినిమా వస్తుందని చెప్పాను. మనలాగే కళ్యాణ్ గారు కూడా వాల్తేరు వీరయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో పూనకాలు లోడింగ్ కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు.. సినిమా మొత్తం పూనకాలు వస్తూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విశ్వరూపం వాల్తేరు వీరయ్య. సినిమా అంతా జాతరలా ఉంటుంది.”
‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ, ఇలా పవన్ కు సాంగ్ చూపించిన విషయాన్ని బయటపెట్టాడు. గతంలో పవన్ కల్యాణ్ తో సినిమా చేశాడు బాబి. అప్పట్నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇక చిరంజీవి సినిమాల్ని పవన్ కల్యాణ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాడు. అన్నయ్య ఏం చేసినా మెచ్చుకుంటాడు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్ ను పవన్ మెచ్చుకున్నాడు.