పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు పవన్. అయితే ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకో 20 శాతం షూటింగ్ మిగిలి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా మొత్తం షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల డిసెంబర్లో మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ దర్శకనిర్మాతలకు సూచించాడట. ఈ మేర డిసెంబర్ లో డేట్స్ కూడా ఇచ్చాడట.
మరోవైపు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్ ప్రారంభం అవుతుండటం తో బాలయ్య కూడా డిసెంబర్లోనే డేట్స్ ఇచ్చాడట. దీంతో పవన్ బాలయ్య ఇద్దరూ కూడా డిసెంబర్లోనే బరిలోకి దిగబోతున్నారు.