చేతకాని ఎంపీలు ఎంత మంది ఉంటే మాత్రం ఏం లాభమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ఎంపీలపై విమర్శలు చేశారు. విశాఖ స్ట్రీల్ ప్లాంట్ కు మద్దతుగా ఒక్క రోజు దీక్ష చేసిన పవన్ వైసీపీ తీరుపై మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. జనసేనకి ఒక్క ఎంపీ ఉన్నా.. కేంద్రంలో మాట్లాడే వాడినని అన్నారు. స్ట్రీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ కాదని..అది ఆంధ్రుల ఆత్మ గౌరవమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం 152 మంది ప్రాణాలు తీసుకున్నారని పవన్ గుర్తు చేశారు. పార్లమెంట్ లో మాట్లాడే దమ్ము వైపీపీ ఎంపీలకు ఉందా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే బూతులు తిడుతున్నారని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు.
స్ట్రీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న నరసనలకు మద్దతు తెలుపుతూ ఈ రోజు పవన్ దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షను విరమించన ఆయన ప్రసంగించారు. దానికి ముందు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.