చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెల నిండా తనపై అభిమానం నింపుకున్న యువకులు కరెంట్ షాక్‌తో మరణించడం తన మనసుని కలచివేసిందని అన్నారు. ఇది మాటలకందని విషాదమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న పవన్… వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని చెప్పారు. వారిని ఆర్థికంగా తానే ఆదుకుంటానని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
గాయపడినవారికి మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని స్థానిక నాయకులకు పవన్ సూచించారు.
వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులను కోరారు.