విరాటపర్వంతో పాటు రిలీజైంది గాడ్సే మూవీ. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు రిలీజైన మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఇప్పుడీ సినిమాకు, పవన్ కల్యాణ్ కు లింక్ పెడుతూ ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది.
గాడ్సే మూవీ ప్రచారంలో భాగంగా మాట్లాడిన దర్శకుడు గోపీ గణేశ్, ఈ కథను పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నట్టు ప్రకటించాడు. పవన్ బిజీగా ఉండడంతో, ఆయనకు కథ వినిపించే అవకాశం రాలేదని, అంతలోనే సత్యదేవ్ ట్రాక్ లోకి రావడంతో అతడితో చేశానని ప్రకటించాడు.
ఈ ప్రకటనను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు పవన్ అభిమానులు. గాడ్సే సినిమా నుంచి పవన్ కల్యాణ్ విజయవంతంగా తప్పించుకున్నాడంటూ సంబరపడుతున్నారు. ఒకవేళ, పవన్ గనుక చేసి ఉంటే.. అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఇది నిలిచేదని అంటున్నారు.
అలా గాడ్సే సినిమా నుంచి పవన్ తప్పించుకున్నాడట. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. సి కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది.