జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూతిపరుడు, నటుడు పోసాని కృష్ణమురళి.. మరోసారి మీడియా ముందుకొచ్చాడు. ఇంతకు ముందు ప్రెస్ మీట్ తర్వాత తనను పవన్ అభిమానులు టార్గెట్ చేశారని చెప్పాడు. వేలల్లో మెసేజ్ లు వస్తున్నాయని.. తన కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో తిడుతున్నారని వాపోయాడు. ఈ సందర్భంగా మళ్లీ పవన్ పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు పోసాని.
కనీసం ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్… పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్ తో పోల్చుకోవడం తనకు నచ్చలేదన్నాడు పోసాని. తాను జగన్ అభిమానినని… ఆయనను ఎవరేమన్నా భరించలేనని చెప్పుకొచ్చాడు. పవన్ తన కుటుంబం జోలికొచ్చారని ఆవేశంతో రగిలిపోయాడు. అయితే పోసాని ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే పవన్ అభిమానులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చారు. ఆయనపై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.