భీమ్లా నాయక్ రిలీజ్ కు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 25న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, లుక్స్ అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచేశాయి.
ఇక మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడని తెలుస్తోంది. అలాగే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఫిబ్రవరి 18న ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ముహూర్తం పెట్టినట్లు సమాచారం .
అలాగే హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించడానికి చూస్తున్నారట. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు.
అలాగే థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. కాగా తాజాగా సెట్స్ లో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ గద్దర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. చేతిలో కర్ర, భుజాన గొంగడితో కనిపించారు.