పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలో పాత ఫ్రెండ్ కి అవకాశం ఇస్తారా..?శత్రువులను సైతం ప్రేమిస్తామన్న పవన్ స్నేహితుడిని ప్రేమించకుండా ఎలా ఉంటారు..?పాలిటిక్స్, సినిమా రంగాలు వేర్వేరు అని పవన్ కు తెలిసొచ్చిందా..? అన్నయ్య రాములమ్మను ఎలాగైతే ఓ బెస్ట్ ఫ్రెండ్ లాగే చూశాడో పవన్ కూడా అతని మరోసారి ఫ్రెండ్ లాగా చూడలేడా ..?వీటన్నింటికి సమాధానమే ఈ కథనం..
పవన్ కళ్యాణ్ సినిమాలో తన స్నేహితుడు అలీ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపుగా పవన్ చేసే సినిమాలో ఇంచుమిచుగా అలీ ఉంటారు. కనుక పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలో అలీ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్, అలీ ఇద్దరు మంచి స్నేహితులు. అలాంటిది పవర్ స్టార్ స్థాపించిన జనసేన పార్టీలోకి కాకుండా అలీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. పవన్ పార్టీ పెడతారనే సమయంలో అలీ ఖచ్చితంగా పవర్ స్టార్ తోనే కలిసి నడుస్తారని అంత భావించారు. కానీ అలీ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ జగన్ నాయకత్వంలోని వైస్సార్సీపీలో జాయిన్ అయ్యారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే అలీ స్నేహితుడి పార్టీలో చేరకుండా వైసీపీ కండువా కప్పుకున్నారని అంత అనుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఏపీలో ఎన్నికల సమయంలో పవన్ అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ చెప్పిన వాళ్లకు టికెట్ ఇచ్చిన.. వైసీపీలోకి వెళ్లాడని.. అలీ లాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం సన్నగిల్లుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచానని చెప్పుకొచ్చాడు. దీనికి అలీ కూడా ధీటుగా సమాధానమిచ్చాడు. తాను ఎవరి మీద ఆధారపడి పైకిరాలేదని , తాను తన కష్టాన్ని నమ్ముకునే ఎదిగానని అన్నారు పవన్ లా తాను చిరంజీవి వేసిన బాటలో రాలేదని చెప్పుకొచ్చాడు. పవన్ ఇండస్ట్రీకి వచ్చే నాటికే తాను మంచి నటుడిగా ఉన్నానని చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది.
సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ బ్రదర్ చిరంజీవి విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యాడు. పాలిటిక్స్ లో ఉన్న సమయంలో నన్ను ఎలా తిట్టాలనిపించింది అంటూ చిన్న పిల్లాడిలా మారిపోయి రాములమ్మతోనున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ సమయంలో లేడీ అమితాబ్ స్పందిస్తూ.. రాజకీయాలు, సినిమాలు వేర్వేరు కదా… ఎన్ని అనుకున్న మనమెప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానమిచ్చింది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కూడా అలీతోనున్న వివాదాలను పక్కకుపెట్టాలనే యోచనకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా… పవన్ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నాడు. దాంతో తన సినిమాలో నటించాల్సిందిగా పవన్ అలీకి కబురు పంపాడని ఓ వార్త హల్చల్ చేసింది. ఈ ప్రచారంపై అలీ స్పందించాడు. ఇప్పటి వరకు పవన్ సినిమాలో నటించాలని తనను ఎవ్వరు సంప్రదించలేదన్నారు. ఒకేవేళ తాను నటించాలని కోరితే నేను సిద్ధమంటూ స్పష్ష్టం చేశారు అలీ. తాను రాజకీయాలను, సినిమాలను వేర్వేరుగా చూస్తానని చెప్పుకొచ్చారు. మరి పవన్ తన స్నేహితుడు అలీకి అవకాశం ఇస్తారో లేదో చూడాలి