వరుసగా సినిమాలను ఓకే చేస్తూ, శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న హీరో పవన్ కళ్యాణ్. ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తి చేయగా, ప్రస్తుతం అయ్యపునం కోష్యిం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. ఇక డైరెక్టర్ క్రిష్ తో సినిమా కూడా పట్టాలెక్కినప్పటికీ అంత వేగంగా ముందుకు సాగటం లేదు. అయితే, ప్రతి నెల 15రోజుల పాటు డేట్స్ అడ్జెస్ట్ చేస్తానంటూ క్రిష్ కు పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమా ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కథ ఫైనల్ కాగా, అయ్యపునం షూట్ పూర్తికాగానే హరీష్ శంకర్ తో జాయిన్ కాబోతున్నాడు.
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించనుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.