పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ త్వరలో పూర్తికానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుండగా… ప్రముఖ హీరోయిన్ శృతి హసన్ పై కొన్సి సీన్స్ తీస్తున్నారు. పవన్ కూడా వచ్చే రెండు వారాలు టైం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు వారాల షెడ్యూల్ తో పవన్ పని పూర్తికానున్నట్లు సమాచారం.
వచ్చే వారం షూట్ లో శృతిహసన్, పవన్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. నిజానికి కేవలం 20నిమిషాల వ్యవధి మాత్రమే ఉన్న క్యారెక్టర్ కు శృతి ఒకే చెప్పింది. పెద్ద సినిమా కావటంతోనే ఆమె అంగీకరించినట్లు ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
హిందీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ దసరా బరిలో ఉండే అవకాశం ఉంది.