సామాన్యుడి తరుపున ప్రశ్నిస్తాం అంటూ ముందుకు వచ్చిన పార్టీ జనసేన. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసీటుకే పరిమితం అయ్యినప్పటికీ అధికారపక్షాన్ని విమర్శించటం లో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ తో మరింత దూకుడు పెంచింది.
ఇది ఇలా ఉంటె త్వరలోనే పొలిటికల్ ఎఫైర్ కమిటీ ని ఏర్పాటు చేసినట్టు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ స్పోక్ పర్సన్స్ గా సుజాత పాండా, సుందరపు విజయకుమార్, పరుచూరి భాస్కర్ రావులను అధికారికంగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.