న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అంటే సుందరానికీ’ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ప్రమోషన్లలో భాగంగా జూన్ 9 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళావేదిక లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
అయితే.. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తెలపింది చిత్ర యూనిట్. దీంతో ఫ్యాన్స్ అందరిలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ విషయాన్ని స్వయంగా నానినే తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు.
“సుందర ప్రసాద్ కోసం పవన్ కళ్యాణ్.. థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్.. మీరు వస్తున్నందుకు నేను, అంటే సుందరానికీ చిత్ర బృందం ఎంతో థ్రిల్ల్ అయ్యాం. 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ ట్వీట్ చేశాడు నాని. ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే.. చివరగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్.. ఎంతటి సంచలనాన్ని సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్పీచ్ గురించి ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మాట్లాడుకుంటున్నారంటే దానికి ఎంత ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన అవసరంలేదు. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ కు పవన్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలిసి.. పవన్ ఎలాంటి మాటలు మాట్లాడనున్నారో అని ఇప్పటినుంచే అభిమానులతో పాటు.. ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.