బాక్స్ ఆఫీస్ వద్ద భీమ్లా నాయక్ సినిమా మంచి విజయం సాధించటం తో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ మీట్ కు రాలేదు. కానీ సక్సెస్ పార్టీకి మాత్రం హాజరయ్యారు.
కాగా భీమ్లా నాయక్‌లో నటించిన యంగ్ బ్యూటీ మౌనిక రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ పార్టీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ తో పాటు మరికొంత మంది కనిపించారు.
ఇక మౌనిక రెడ్డి పోస్ట్ చేసిన కాసేపటికే ఆ వీడియో వైరల్ అయింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంటాడు. కానీ పవన్ రాకతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మించగా రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. ఇక త్వరలో భారీ సక్సెస్ మీట్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కూడా హాజరుకానున్నారట.