సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఈ పాట 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. థమన్ సంగీతం అందించగా…త్రివిక్రమ్ మాటలు అందించారు. ఇక చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.