మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిరంజీవి ఇంటికి అతిధిగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో సహ రావటంతో… ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. తన నలుగురు వారసులతో పవన్ కళ్యాణ్ మెగా ఇంటికి వచ్చారు. రేణు దేశాయ్ బిడ్డలు అకిరా,ఆద్య పూణేలో ఉంటున్నప్పటికీ దీపావళి సందర్భంగా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. ఇక పవన్ భార్య లెజినోవా కూడా తన ఇద్దరు పిల్లలతో విచ్చేసింది. అయితే… రేణు దేశాయ్ పిల్లలు అకిరా, ఆద్యలు లెజినోవాతో అన్యోన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారిద్దరూ కూడా మెగా కాంపౌండ్ నుంచే వరసగా రాబోతున్నారని అర్ధం అవుతుంది.
పవన్ కళ్యాణ్ కుటుంబం తో పాటు నాగ బాబు కుటుంబం, తల్లి అంజనా దేవి కూడా చిరంజీవి ఇచ్చిన విందుకు హాజరు అయ్యారు.