యంగ్ హీరో నితిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. నితిన్ పవన్ కు అభిమాని చెప్పుకుంటారు. అందుకే తన సినిమా ఫంక్షన్స్ కు పవన్ ను ఆహ్వనిస్తారు. ఇటు పవన్ కూడా నితిన్ ను ఆప్తుడిగా భావిస్తారు. పవన్ తనకు ఆప్తులు అనుకున్న వారికి కొన్ని పండగలకు, ప్రత్యే సందర్భాల్లో గిఫ్ట్ పంపి ఆశ్చర్యపరుస్తారు. ఈసారి క్రిస్మస్ సందర్భంగా పవన్ నితిన్ కు గిఫ్ట్ పంపారు.
ఆ గిఫ్ట్ ను చూపిస్తూ… నితిన్ థాంక్యూ అన్న అంటూ ట్విట్టర్ వేదికగా తన అభిమానాన్ని భయటపెట్టారు.
Gettin this hamper from our POWERSTAR PSPK made this Christmas even more merrier😍😍😍 thankuu soo muchh anna 😘😘😘 pic.twitter.com/ysCoL4uc9D
— nithiin (@actor_nithiin) December 24, 2020