ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి కాస్తా గట్టిగానే విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలనను ఆరు ముక్కుల్లో చెప్పొచ్చంటూ పవన్ ట్వీట్ చేశారు. విద్వంశం, దుండుగుతనం, కక్షసాదింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నముగా చెప్పొచ్చన్నారు పవన్ కళ్యాణ్. ఒక్కో పదాన్ని వివరిస్తూ జగన్ రెడ్డి గారి పాలనా ఇదేనంటూ చురకలంటించారు.