రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో మాట్లాడిన సంగతి తెలిసిందే. తేజ్ యాక్సిడెంట్ విషయమై మీడియా సంస్థలపై కూడా మండిపడ్డారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటుండగా తేజ్ అలా పడ్డాడు… ఇలా పడ్డాడు అంటూ అడ్డగోలుగా కథనాలు ప్రసారం చేశారంటూ ఫైర్ అయ్యాడు. అయితే మాటల్లో మాట తేజ్ ఇంకా కళ్ళు తెరవకుండా కోమాలో పడి ఉన్నాడు అని అన్నారు పవన్ కళ్యాణ్.
దీనితో అభిమానులు తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడా అనే ఆలోచనలో పడ్డారు. ఇన్ని రోజులు కూడా తేజ్ ఆరోగ్యంపై వైద్యులు ఇస్తున్న హెల్త్ బులిటెన్ అబద్దమా అని ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ అలా భావోద్వేగంతో మాట్లాడారా లేక నిజంగానే తేజ్ ఇంకా కోమాలో ఉన్నారా అనే దానిపై మాత్రం సందేహం నెలకొంది.