వరుస అపజయాలతో చితికిలపడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు తాజా చిత్రం ఎనర్జీని ఇచ్చింది. మారుతీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజు పండగే’ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ నమోదైంది. ఈ నేపథ్యంలో సాయితేజ్ కు పవన్ కల్యాణ్ నుంచి ప్రత్యేక సందేశం అందింది. తన మేనమామ నుంచి వచ్చిన ఆ సందేశాన్ని సాయితేజ్ సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్నారు.
ప్రతిరోజు పండగే సినిమా మంచి విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో నీవు చేసే సినిమాలు ఇలాగే విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాని పవన్ మెసెజ్ పంపారు. దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ … ఎలా స్పందించాలో తెలియడం లేదని… థాంక్స్ చెబితే అది చాలా చిన్న మాట అవుతుందని , “లవ్యూ పవన్ కల్యాణ్ మామా” అంటూ ట్వీట్ చేశాడు.