వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. జగన్ సేన వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శల దాడి చేస్తున్నారు. పవన్ చేసిన ప్రతీ వ్యాఖ్యకు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ఆదివారం మంత్రులు ఒకరి తర్వాత ఒకరు విమర్శల దాడి చేయగా.. తాజాగా వైసీపీ సానుభూతిపరుడు, నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఈ లిస్టులోకి చేరిపోయారు. అయితే పోసాని ప్రెస్ మీట్ తర్వాత పవన్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
వరుసగా రెండు ట్వీట్లు చేసిన పవన్.. మొదటి ట్వీట్ లో వైసీపీ పేరును మెన్షన్ చేశారు.
పవన్ చేసిన ట్వీట్
“తుమ్మెదల ఝుంకారాలు..
నెమళ్ల క్రేంకారాలు..
ఏనుగుల ఘీంకారాలు..
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే”
అదండి సంగతి.. వైసీపీ నేతలను గ్రామ సింహాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు పవన్. అంతటితో ఆగారా..? కాసేపటికి ఇంకో ట్వీట్ చేశారు. ఈసారి వైసీపీ పేరును మెన్షన్ చేయలేదుగానీ.. మొదటి ట్వీట్ కు దీనికి లింక్ ఉందనే అనిపిస్తోంది. ఎందుకంటే.. అక్కడ గ్రామ సింహాలు అనే పదాన్ని వాడారు కాబట్టి. రెండో ట్వీట్ లో తన ఫేవరెట్ సాంగ్ ఇదేనంటూ హు లెట్ ది డాగ్స్ ఔట్(Who Let The Dogs Out) సాంగ్ వీడియోను పోస్ట్ చేశారు.
Baha Men – Who Let The Dogs Out (Original version) | Full HD | 1080p https://t.co/Ebyzd7tdbk via @YouTube
( This is one of my favourite song)— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
Advertisements
వైసీపీ నేతలు, సానుభూతిపరులు తనపై వరుసగా విమర్శలు చేస్తున్న తరుణంలో.. పవన్ చేసిన డాగ్స్ ట్వీట్స్ వాళ్లను ఉద్దేశించే చేశారని అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలు.