ఓవైపు వైసీపీ నాయకులు వరుసబెట్టి విమర్శలు చేస్తున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. తాజాగా సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ క్యాప్షన్ తో సోషల్ మీడియాలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు పవన్.
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు – వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
Advertisements
ఇష్టం వచ్చినట్లు ప్రజలపై పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి పాలిస్తే అది సుపరిపాలన అనిపించుకోదని విమర్శించారు. ఇదసలు సంక్షేమం కానే కాదని మండిపడ్డారు. నవరత్నాలు భావితరాలకు నవకష్టాలుగా మారతాయని చెప్పారు పవన్.
అసలే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు రగిలిపోతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ గట్టిగానే ఇస్తున్నాయి. అయితే పవన్ కూడా వెనక్కి తగ్గకుండా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చేసిన పోస్టుపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఇట్రస్టింగ్ గా మారింది.