ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. అయితే ఇప్పటినుంచే కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోంది. రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో ప్రభుత్వంపై విమర్శలు.. ఆ తర్వాత వరుసగా ట్వీట్లు చేస్తూ జనసేన కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అంతేకాదు అక్టోబర్ 2న రాష్ట్రంలో ఘోరంగా తయారైన రోడ్లను బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా ఆయనే రంగంలోకి మరమ్మతులు చేయనున్నారు.
ఇటు పవన్ విమర్శలను వైసీపీ వర్గాలు గట్టిగానే తిప్పికొడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ గ్రామసింహాల ట్వీట్ పై రచ్చ నడుస్తోంది. మంత్రి పేర్ని నాని కూడా దీనిపై స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో జనసేన అధ్యక్షుడు కూడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో ట్వీట్ చేశారు.
పవన్ చేసిన తాజా ట్వీట్
వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది.
ఈ ట్వీట్ చూసి పవన్ ఇకపై రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడతానన్న సంకేతాలు ఇచ్చారంటూ కార్యకర్తలు భావిస్తున్నారు.