రాజకీయాల్లో బిజీ అయ్యి సినిమాలు చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్, పింక్ రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యాడు. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే నెల చివరి వారంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఇండస్ట్రీవర్గాల సమాచారం. అయితే ఈ మూవీ గురించి బయటకి వచ్చిన ఒక న్యూస్ అందరికీ షాక్ ఇస్తుంది. పింక్ రీమేక్ లో నటించడానికి పవన్ కళ్యాణ్, నలభై కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. మామూలుగానే పవన్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ, ఇప్పుడు రీఎంట్రీ కాబట్టి మెగా అభిమానులు కాసుల వర్షం కురిపించడం ఖాయం. పింక్ ఆల్రెడీ హిట్ కాబట్టి కంటెంట్ గురించి రిజల్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయం క్లియర్ గా తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్, పింక్ లో నటించడానికి 40 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 25 శాతం వాటా కూడా అడుగుతున్నాడట. 25% అంటే దాదాపు మరో 15 నుంచి 20 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏడాది గ్యాప్ తీసుకున్నందుకు తన డిమాండ్ పెరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడన్నమాట.
ఒకప్పుడు ఆరు నెలలకో ఏడాదికో ఒక సినిమా చేసి 30 కోట్ల వరకూ తీసుకునే పవన్ కళ్యాణ్, పింక్ రీమేక్ కోసం ఇచ్చిందే 20 రోజుల కాల్ షీట్స్ అని తెలుస్తోంది. మరి 20 రోజులకే అంత తీసుకుంటున్నాడా అని ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నారు. కోర్ట్ రూమ్ డ్రామా కావడం, దాదాపు గంటన్నర సినిమా ఒక చోట జరుగుతుండడంతో 20 రోజుల్లో పూర్తి చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ పవన్ రెమ్యునరేషన్ వింటేనే ఆశ్చర్యంగా ఉంది. పవన్ పేరుతో డబ్బు సంపాదించాలనుకునే వాళ్లు, ఆయన ఎంత డిమాండ్ చేసినా సరే ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పవన్ కి ఉన్న క్రేజ్ వాడుకోవాలని నిర్మాతలు భావిస్తున్నా, నిర్మాతల డిమాండ్ ని పవన్ క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నా… ఈ రెండు విషయాల ఇంపాక్ట్ పడేది మాత్రం అభిమానుల మీదే. టికెట్ రేట్ పెంచి వసూళ్లు చేసేది వాళ్ల నుంచే. దీని బదులు ఎలాగూ రీఎంట్రీ సినిమాకి డబ్బులు వస్తాయని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ నేరుగా లాభాల్లోనే కొంత వాటా తీసుకోని ఉంటే బాగుండేది. ఇప్పటికైతే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోలని వెనక్కి నెట్టాడు.