జానీ కాకుండా పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా..? టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక్కడు. ఆయన స్టైల్ , మ్యానరిజంకు యువత ఫిదా అయిపోతారు. ఒక్కసారి మెడపైన చెయ్యి పెడితే చాలు థియేటర్ దద్దరిల్లిపోతుంది. బద్రి, ఖుషి సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. జల్సా సినిమా తర్వాత వరుస ప్లాప్స్ ఇచ్చిన.. క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. కానీ ఆ తర్వాత గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తో తన అభిమానుల ఆకలి తీర్చాడు.

అయితే హీరోగా ఎంతో సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్… దర్శకునిగా కుడా బాధ్యతలు చెప్పటారు. తానే హీరోగా డైరెక్టర్ గా జానీ అనే సినిమా చేసారు పవన్. ఇందులో ఆయనకు జంటగా రేణుదేశాయ్ నటించగా… ఈ సినిమా అంతగా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. కానీ ఓ మంచి లవ్ సినిమాగా మిగిలిపోయింది. కానీ ఈ ఒక్క సినిమాకే కాకుండా పవన్ మరో సినిమాకు కూడా దర్శకత్వం వహించారట. ఆ సినిమా పేరు ఖుషి.

ఈ ఖుషి సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య దర్శకునిగా ఉన్నారు. కానీ.. ఇందులో సగానికి పైగా సినిమాను పవన్ డైరెక్ట్ చేసారు. ఇందులోని ఫైట్స్… అలాగే సూపర్ హిట్ అయిన పాటలు అన్నింటికీ ఆయనే దగ్గరుండి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎడిటింగ్ పనులు కూడా ఆయనే చూసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తెలిపారు. ఈ ఖుషి సినిమా పవన్ కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్న పవన్… వరుస సినిమాలు కూడా చేస్తున్నారు.
Also Read: