పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ మాల్దీవుల్లోని బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని పోస్ట్ చేసి వేదాంతం చెప్పుకొచ్చింది రేణు. పర్వతాలు నా హృదయం అయితే, నాకు తెలుసు సముద్రం నా ఆత్మ అని, కొన్ని గంటలపాటు ఈత కొట్టిన తరువాత నాకు అనిపించింది నాకు కూడా చేపలానే ఆత్మ ఉందంటూ రాసుకొచ్చింది రేణు. ఇటీవల దీపావళి సందర్భంగా రేణు పిల్లలు అకీరా, ఆద్య లు పవన్ తో మెగా ఇంట్లో సెలెబ్రేట్ చేసుకున్నారు. పవన్ భార్య అన్నా లెజినోవాతో పాటు మెగా ఫ్యామిలీ తో కలివిడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రేణుదేశాయ్ పిల్లలతో పూణే లో ఉంటుంది.