పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్. వరుస ఫ్లాప్స్ తో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తో తన స్టామినా ఏంటో నిరూపించాడు. జూలు విదిల్చిన సింహం లా, గబ్బర్ సింగ్ సినిమా లో నటించిన పవన్ ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని అందించాడు. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, సాంబా రాస్కోరా అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్లు మోత మోగిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో మీకు ముందే తెలుసు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయి సరిగ్గా ఈ రోజుకు ఎనిమిది ఏళ్ళు. మే 11,2012 ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. పెద్ద హిట్స్ లేని హరీష్ శంకర్ ..పవన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ గబ్బర్ సింగ్ అనే సినిమాని తెరకెక్కించాడు.
కబడ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులని బద్దలుకొట్టాడు. పవన్ తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసిన ఈ సినిమా మాత్రం ఎప్పటికీ స్పెషల్ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చిత్రం వకీల్‌సాబ్‌తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 25 చిత్రాలు పూర్తి చేసుకోగా, అందులో మాస్ ఆడియన్స్‌కి కూడా మాంచి కిక్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ అనే చెప్పాలి.