అభిమానం ప్రాణం తీసింది. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ కట్టబోయిన యువకులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో పవన్ బర్త్‌డేను పెద్దఎత్తున జరపాలని పవన్ కల్యాణ్ అభిమానులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కదిరివోబనపల్లె, శ్యామరాజుపురం వెళ్లే దారిలో ఉన్న కరెంట్ స్తంభానికి 25 అడుగుల ఎత్తున్న ఫ్లెక్సీని నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఫ్లెక్సీకి ఉన్న ఇనుప ఫ్రేమ్.. విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్‌కు గురయ్యారు. బాధితులంతా పాతికేళ్ల లోపు వారే. యువకులు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.