ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు. 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ప్రస్తుతం షూటింగ్ లకు పర్మిషన్ లు రావడంతో మళ్లీ మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాను మొదటి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది .
అయితే ఈ చిత్రానికి సంబంధించి న్యూ ఇయర్ రోజు టీజర్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ తో అభిమానులకు చిన్న ట్రీట్ ఇచ్చారు చిత్ర యూనిట్. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సరైన అప్డేట్ మాత్రం రావడం లేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. ఇక ఈ ఏడాది ఆరంభం రోజైనా ఆ నిరాశ పోగొట్టే విధంగా టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.