పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ బెనిఫిట్ షో రద్దు చేయడం ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. తిరుపతిలో గ్రూప్ థియేటర్స్‌లో వకీల్‌సాబ్ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే బెనిఫిట్ షో టికెట్ కొన్న పవన్ కల్యాణ్ అభిమానులు.. మొదట బెనిఫిట్ షో నిర్వహించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోరారు. వారు నిరాకరించడంతో థియేటర్ పై రాళ్లు రువ్వారు. అద్దాలు పగలగొట్టారు.
అటు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులోనూ అభిమానులు ఆందోళనకు దిగారు. వకీల్ సాబ్ సినిమాకోసం అభిమానులు బెనిఫిట్ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్‌లో బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.