ఓవైపు సినిమాల తో బిజీ బిజీగా గడుపుతూనే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికార వైసీపీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన నిలబడు తున్నారు.
ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల తరఫున పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. నర్సాపురం వేదికగా జరుగుతున్న ఈ మత్స్యకార సభలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు.
ఇక పవన్ రాకతో అభిమానులు హంగామా అంతా ఇంతా కాదు. జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ గోల చేశారు.
అయితే ఆ సమయంలో లో ఓ అభిమాని పవన్ ను కింద పడేశాడు. కారు పైన నిలుస్తున్న పవన్ ను ఒక్కసారిగా వెనకనుంచి వచ్చి పట్టుకోబోయాడు. అది చూసిన బాడీగార్డ్ అభిమాని ని కిందకు లాగాడు. ఆ సమయంలో పవన్ కింద పడ్డాడు. అయితే మళ్ళీ వెంటనే లేచి నిల్చొని ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.